![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -85 లో......మాధవకి గాయత్రి నిజం చెప్పి పెళ్లి చెయ్యమని అడగడానికి తాంబులం పట్టుకొని మహా కేశవ, చక్రి, కన్నా వెళ్తారు. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మహాని తాయారు తిడుతుంది. దాంతో తనపై కర్ర ఎత్తుతాడు కేశవ. మా వదిన జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళందరూ తాయారు ఇంటికి వెళ్లిన విషయం మాధవకి తెలిసి పరుగున ఇంటికి బయల్దేరతాడు. ఆ తర్వాత మహా, కన్నా, కేశవ, చక్రి అందరు తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చాక నారాయణ వాళ్ళతో మాట్లాడతాడు. ఏమైంది తిట్టాలిసినవన్నీ తిట్టారా అని మహా, చక్రి, కేశవ,కన్నా వాళ్ళని నారాయణ అడుగుతాడు.
నీ కంటే వాళ్ళ గురించి తెలియదు వీళ్ళకి అయినా తెలుసు కదా.. వాళ్ళకి వచ్చిన ఆస్తులు అమ్ముకొని నా వాటా కావాలని కోర్ట్ లో కేసు వేశారు.. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి పిల్లని ఇవ్వమని అడుగుతారా.. ఇంతకన్నా మూర్కులు ఎవరైనా ఉంటారా అని నారాయణ కోప్పడతాడు. అప్పుడే మాధవ వస్తాడు. అక్కడికి ఎందుకు వెళ్లారని అందరిపై కోప్పడతాడు మాధవ. నేను మీకు చెప్పానా నాకు ఇది కావాలని.. అసలు ఎవరు మీరంతా అని మాదవ కోప్పడతాడు. మేం ఎవరిని మమ్మల్ని చూస్తున్నావ్ అన్నయ్య అని చక్రి ఎమోషనల్ అవుతాడు. ఒరేయ్ నువ్వు చదువుకునేవాడివి ఎందుకురా నీకు ఇవన్నీ అని కన్నాపై మాధవ అరుస్తాడు. నావల్లే ఇదంతా బయట నుండి వచ్చిన దాన్ని బయటకి వెళ్ళేదాన్ని సైలెంట్ గా ఉండకుండా నేను తప్పు చేసానని మాధవకి మహా సారీ చెప్పి దిగాలుగా లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మాధవ దగ్గరికి మహా వచ్చి మాట్లాడుతుంది. కోపం తగ్గిందా అని అడుగుతుంది. ఎవరి మీద నాకు కోపం లేదు.. వాళ్ళు మంచి మనుషులు కాదు.. అనవసరంగా వాళ్ళతో మీకెందుకు గొడవ అని మాధవ అంటాడు. ఆ తర్వాత ఉదయం నారాయణకి తగిలిన దెబ్బకి కట్టు చేంజ్ చెయ్యాలని మహా వస్తుంది. వద్దని నారాయణ అంటాడు. దాంతో తన కొడుకులతో కట్టు చేంజ్ చేయించుకుంటాడు నారాయణ. అందరు నారాయణకి చెక్కిలిగింతలు చేస్తూ నవ్విస్తారు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వచ్చి.. నా ఫోన్ ఇస్తే ఒక్క రీల్ చేసుకుంటాను ప్లీజ్.. ఫాలోవర్స్ హ్యాపీ నెస్ అని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కేశవ ఒప్పుకుంటాడు కానీ శైలు చేతికి కేశవ గొలుసు కడతాడు. ఇప్పుడు చెయ్ నీ రీల్స్ అంటూ ఫోన్ ఇస్తాడు కేశవ.. శైలు రీల్స్ చేస్తుంది. తరువాయి భాగంలో మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ డీటేల్స్ పెడుతుంది మహా. ఆ విషయం మాధవకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |